తెలంగాణ

telangana

ETV Bharat / state

'సుప్రీంలో జస్టిస్​ కనగరాజ్​తో పిటిషన్​ వేయించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం' - నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌ ఎస్​ఈసీగా రమేశ్​కుమార్​ కొనసాగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని... జస్టిస్​ కనగరాజ్​తో పిటిషన్​ వేయించే ఆలోచన చేస్తుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇది సరైన పద్దతి కాదన్న ఆయన... రాజ్యాంగ సంస్థలను గౌరవించాలని సూచించారు. కరోనా విషయంలో మొదట్లో పట్టించుకోకుండా ఇప్పుడు డబ్బులు విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.

mp-k-raghurama-krishnam-raju-comments-on-sec-case
'సుప్రీంలో జస్టిస్​ కనగరాజ్​తో పిటిషన్​ వేయించే ఆలోచనలో ప్రభుత్వం'

By

Published : Jul 25, 2020, 1:30 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ఎస్​ఈసీ అంశంలో జస్టిస్ కనగరాజ్ సుప్రీంకోర్టకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు. ఈ పరిస్థితి చూస్తేంటే నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా కొనసాగించే ఆలోచన లేనట్లు అర్థమవుతోందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు హితవు పలికారు.

కరోనా లెక్కలపైనా అనుమానం

ప్రభుత్వం రోజూ విడుదల చేస్తున్న కరోనా కేసుల సంఖ్యపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిన్న 900 కేసులు ఉన్నట్టు ప్రభుత్వం చెప్పిందని... వాస్తవంగా అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నట్టు అనిపిస్తోంది అన్నారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన పాలకులే... మాస్క్​ల్లేకుండా తిరిగి కరోనా విజృంభణకు కారణమయ్యారని ఆరోపించారు. సీఎం వెయ్యి కోట్లు విడుదల చేయడాన్ని స్వాగతించిన ఆయన... మొదటి నుంచి శ్రమించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు.

ఇదీ చదవండి:ఏజెన్సీ ప్రాంతాల్లో 'పురిటి నొప్పులకు ముందే ప్రసవ వేదన'

ABOUT THE AUTHOR

...view details