తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ శాసన మండలి రద్దు అంశంపై కేకే ఆసక్తికర వ్యాఖ్యలు - 'ఏపీ శాసనమండలి రద్దు సరికాదు'

ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తెరాస సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందించారు. మండలిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. మండలి ఖర్చు వృథా అని జగన్​ అనడం... నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు.

TAAZAA
TAAZAA

By

Published : Jan 28, 2020, 3:04 PM IST

Updated : Jan 28, 2020, 3:41 PM IST

ఏపీ శాసన మండలి రద్దు అంశంపై కేకే ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం, మండలిపై రూపాయి ఖర్చయినా దండగేనంటూ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెరాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్పందించారు.

ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని అభిప్రాయపడ్డారు. మండలి ఖర్చు వృథా వ్యయం అనడం నాన్సెన్స్‌ అని వ్యాఖ్యానించారు. పెద్దల సభ ఎంతో అవసరమన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్‌ నాగిరెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీర్మానాలను కేంద్రం అమలు చేస్తుందని చెప్పారు. అవసరమైతే అమలుకు ఎక్కువ సమయం తీసుకోవచ్చని చెప్పారు.

ఇవీ చూడండి:అశ్లీల వీడియోలు చూపించే... ఆ సార్​ మాకొద్దు..!

Last Updated : Jan 28, 2020, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details