తెలంగాణ

telangana

ETV Bharat / state

రొంపిచర్ల పీఎస్​లో ఎంపీ గల్లా జయదేవ్​ అర్ధనగ్న ప్రదర్శన - ap assembly news

ఎంపీ గల్లా జయదేవ్​ అరెస్టును నిరసిస్తూ ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల పోలీస్​ స్టేషన్​ ఎదుట తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీస్​స్టేషన్​లో గల్లా జయదేవ్ అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు.

GALLA JAYADEV
రొంపిచర్ల పీఎస్​లో ఎంపీ గల్లా జయదేవ్​ అర్ధనగ్న ప్రదర్శన

By

Published : Jan 20, 2020, 11:26 PM IST

రొంపిచర్ల పీఎస్​లో ఎంపీ గల్లా జయదేవ్​ అర్ధనగ్న ప్రదర్శన

ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల పోలీస్​స్టేషన్​లో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఉదయం గల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు నరసరావుపేట వన్​టౌన్​ ఠాణాకు తరలించారు.

విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు స్టేషన్​ వద్దకు చేరుకున్నారు. జయదేవ్ అక్రమ అరెస్ట్​ను నిరసిస్తూ కార్యకర్తలు, అభిమానులు ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో స్టేషన్​ ఎదుట తీవ్ర ఉద్రిక్త వాతవరణం నెలకొంది.ఆందోళన దృష్ట్యా పోలీసులు జయదేవ్‌ను సత్తెనపల్లికి తరలించారు.

రొంపిచర్ల పీఎస్​లో ఎంపీ గల్లా జయదేవ్​ అర్ధనగ్న ప్రదర్శన

ABOUT THE AUTHOR

...view details