MP CM Shivraj Singh Chauhan Allegation on KCR :మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై పడింది. మొన్నటి వరకు కేరళ ప్రభుత్వంపై (Kerala Government) తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. దిల్లీ నుంచి వచ్చిన కొందరు జర్నలిస్టులతో తన నివాసంలో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి కేంద్రంగా మారిందని ఆరోపించారు.
Sanjay Raut On CM KCR : 'ఓటమి భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చారు'
మధ్యప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ పోటీ చేస్తే తాము స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు.. భారత్ రాష్ట్ర సమితితో సంప్రదింపులు జరుపుతున్నారని శివరాజ్ వెల్లడించారు. సంప్రదింపులు జరిపిన నాయకులందరూ.. బీజేపీ నుంచి టికెట్ రాదని ఆశలు వదులుకున్నవారేనని శివరాజ్ వివరించారు.
Shivraj Singh Allegations Against AP Govt :ఇదే సందర్భంలో ఏపీ ప్రభుత్వంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ రాష్ట్రంలో వాలంటీర్‌వ్యవస్థ (AP Govt Volunteer System) అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులు ఇస్తే.. వారు పార్టీ కోసమే పని చేస్తారని.. ప్రజా సంక్షేమం కోసం పని చేయారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అందిస్తోన్న సామాజిక పింఛన్లు పారదర్శకంగా ఉంటేనే.. ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని శివరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా పాల్గొన్నారు.
CM KCR Maharashtra Tour : 600 కార్లతో భారీ కాన్వాయ్‌గా మహారాష్ట్రకు సీఎం కేసీఆర్