పీఎం కేర్స్ నిధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశ అభిమానులు తమ స్థోమతను బట్టి వంద రూపాయలకు తగ్గకుండా విరాళం ఇవ్వాలని ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 3న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు తమతో పాటు మరో పదిమందితో సహాయనిధిలో జమ చేయించాలని సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తోచినంత సాయం చేసి దేశాన్ని కాపాడుకుందామని సంజయ్ పేర్కొన్నారు.
'విపత్కర పరిస్థితుల్లో కలిసుందాం... ఆర్థిక సాయం చేద్దాం' - కరోనా నివారణ చర్యలు
కరోనా నియంత్రణ చర్యలకై పీఎం కేర్స్ నిధికి ప్రజలంతా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి ఆర్థికంగా సహాయం అందించాలన్నారు.

'విపత్కర పరిస్థితుల్లో కలిసుందాం... ఆర్థిక సాయం చేద్దాం'
'విపత్కర పరిస్థితుల్లో కలిసుందాం... ఆర్థిక సాయం చేద్దాం'