తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీకి భద్రత కల్పించని పోలీసులపై చర్యలు తీసుకోవాలి: సంజయ్

వరంగల్​లో ఎంపీ ధర్మపురి అర్వింద్​పై జరిగిన దాడికి పోలీసులు సహకరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. ఎంపీకి భద్రత కల్పించని పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన​ డిమాండ్​ చేశారు.

mp bandi sanjay on attack on mp arvind on government
ఎంపీకి భద్రత కల్పించని ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్ఎంపీకి భద్రత కల్పించని ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్ఎంపీకి భద్రత కల్పించని ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్

By

Published : Jul 13, 2020, 6:58 PM IST

Updated : Jul 13, 2020, 8:19 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కార్యాలయంపై, ఎంపీ ధర్మపురి అర్వింద్​, పార్టీ నేతలపై తెరాస నేతల దాడికి పోలీసులు సహకరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత సెగ తాకకుండా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద మాత్రమే పోలీసులు కాపలా కాస్తున్నారని మండిపడ్డారు.

వరంగల్​ భాజపా కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్​పై దాడి జరుగుతున్న సమయంలో దాడిని నిలువరించని, ఎంపీకి భద్రత కల్పించని పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కార్యాలయాలు, ఇళ్ల ముందు భయంతో పహారా కాస్తున్న పోలీసులకు భాజపా కార్యాలయం, ఎంపీ అర్వింద్​పై దాడి జరుగుతున్న సమయంలో విధులు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.

Last Updated : Jul 13, 2020, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details