తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తా: అసదుద్దీన్ - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్​పూర్​లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. దీర్ఘకాల కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.

MP Asaduddin visits Mooshirabad division bholakpur
ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తా: ఎంపీ అసదుద్దీన్

By

Published : Oct 5, 2020, 10:23 PM IST

ముషీరాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భోలక్​పూర్ ప్రజల కాలుష్య నీటి సమస్యకు నిర్మాణాత్మక ప్రణాళికతో శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. డివిజన్​లోని పలు కాలనీల్లో ఎంపీ, కార్పొరేటర్ అఖిల్ అహ్మద్ పర్యటించారు. కలుషిత నీటి సమస్య వల్ల 14మంది మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఏడు కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజీ పైపులైను నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. భోలక్​పూర్ ప్రజలకు 12 కోట్ల రూపాయలతో మంచినీటి పైపులైన్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పైపులైను నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్​ను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అతను వేసే బొమ్మలకు కుంచె అవసరంలేదు... గోళ్లు చాలు

ABOUT THE AUTHOR

...view details