రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఈరోజు జరగనున్న మంత్రివర్గ భేటీని ఉద్దేశించి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. లాక్ డౌన్ లేకుండానే కరోనా కేసులు తగ్గుతున్నాయన్న ఆయన.... మహమ్మారిపై పోరాడేందుకు మాస్కుల వినియోగం, భౌతిక దూరాన్ని పాటించేలా ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
Asaduddin: మరోసారి లాక్డౌన్ పొడిగించవద్దు: ఎంపీ అసదుద్దీన్ - ట్విట్టర్లో ప్రభుత్వానికి వినతి
రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు మరోసారి లాక్ డౌన్ పొడిగించవద్దని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ లేకుండానే కేసులు తగ్గుతున్నాయని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మహమ్మారిపై పోరాడేందుకు మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించేలా ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరోసారి లాక్ డౌన్ పొడిగించవద్దన్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
మహమ్మారికి పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమేనని పేర్కొన్న అసదుద్దీన్ .... లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రభుత్వాలు శాంతి, భద్రతల సమస్యగా మారుస్తున్నాయని పేర్కొన్నారు. ఇకపై లాక్ డౌన్ పొడిగించవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ట్విట్టర్ ద్వారా కోరారు. లేని పక్షంలో సాయంత్రం ఆరు గంటల నుంచి కర్ఫ్యూ విధించి.. కొవిడ్ క్లస్టర్లలో మినీ లాక్ డౌన్ అమలు చేయాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:Sathyavathi rathod: 'కొవిడ్ వల్ల అనాథలైన పిల్లలను సంరక్షించండి'
Last Updated : May 30, 2021, 2:20 PM IST