జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భోలక్ పూర్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. భోలక్ పూర్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ గౌస్ ఉద్దీన్, పార్టీ శ్రేణులతో కలిసి ముషీరాబాద్ మెయిన్ రోడ్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు.
భోలక్‌పూర్‌లో కలుషిత నీటి సమస్యను పరిష్కరించాం: అసద్ - జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రచారం
భోలక్‌పూర్ డివిజన్‌లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పర్యటించారు. పతంగి గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థించారు. డివిజన్‌లో మంచినీటి సమస్యను పరిష్కరించామని గుర్తు చేశారు.
భోలక్‌పూర్‌లో కలుషిత నీటి సమస్యను పరిష్కరించాం: అసద్
డివిజన్‌లోని మహమ్మద్ నగర్, మండీ గల్లీ, బంగ్లాదేశ్ మార్కెట్, గుల్షన్ నగర్, బీర్బన్ గల్లీ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పతంగి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కలుషిత నీటి సమస్య పరిష్కారానికి పైప్ లైన్ ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి:'గెలవాల్సిందే.. పట్టు బిగించాల్సిందే'