mp asaduddin owaisi: హైదరాబాద్ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శాసనసభ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణపై ఎంపీ స్పందించారు. మంత్రి కేటీఆర్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదన్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పుపై చర్చించుకున్నట్టు అసదుద్దీన్ తెలిపారు.
కారు స్పీడ్ మీదుంది.. యూపీ ఫలితాలు తెలంగాణలో పునరావృతం కావు: అసదుద్దీన్
mp asaduddin owaisi: రాష్ట్రంలో కారు స్పీడ్ మీదుందని.. భాజపా అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఫలితం ఉండదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జోస్యం చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తననేమీ ఆశ్చర్యపర్చలేదని, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎన్నికలకోసం మరింత ముందు నుంచే సిద్ధమవ్వాల్సిందన్నారు. రాష్టంలో సీఎం కేసీఆర్ బలంగా ఉన్నారని పేర్కొన్నారు. భాజపా తెలంగాణపై దృష్టి సారించినా యూపీ లాంటి ఫలితాలు పునరావృతం కావని అసద్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'తాత్కాలిక పండ్ల మార్కెట్ కోసం వక్ఫ్ బోర్డు స్థలాలిచ్చేందుకు సిద్ధం..'