మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. మలక్‌పేట నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. నియోజవకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలను సందర్శించి తనిఖీ చేశారు. కార్యక్రమంలో మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల, ఓల్డ్ మలక్‌పేట కార్పొరేటర్ సైఫుద్దీన్ షఫీ, జీహెచ్‌ఎంసీ అధికారులు, వైద్య సిబ్బందితో పాటు ఎంఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
MP Asaduddin: వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీ అసదుద్దీన్ - mp asaduddin in malakpet constituency
హైదరాబాద్ మలక్‌పేట్ నియోజకవర్గంలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలను సందర్శించారు.
మలక్‌పేట నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ అసదుద్దీన్