హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురా సుల్తాన్ షాహీ ప్లే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్-19 పరీక్ష కేంద్రాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. ఆ ప్రాంత వాసుల సౌకర్యార్థం సుల్తాన్ షాహీ మైదానంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
సుల్తాన్ షాహీ మైదానంలో కొవిడ్ నిర్ధారణ కేంద్రం ఏర్పాటు - పాతబస్తీలోని సుల్తాన్ షాహీ మైదానంలో కొవిడ్ నిర్ధారణ కేంద్రం తాజా వార్త
రోజురోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కొవిడ్ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా పాతబస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు.
సుల్తాన్ షాహీ మైదానంలో కొవిడ్ నిర్ధారణ కేంద్రం ఏర్పాటు
కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, కార్పొరేటర్ అబూ రాహిల్, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఇది చదవండి:ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక