అందాల తార దియా మీర్జా ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖితో తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ సోఫాలో కూర్చున్న ఫొటోని పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఓపికగా ఎదురుచూడడం కూడా ఒక కళే.. అయితే దీనికి అంత గుర్తింపు దక్కలేదు’ అని చెప్పుకొచ్చింది.
అందాల తార మౌనీ రాయ్ సముద్ర తీరాన దిగిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి హంసానందిని ‘బీచ్ వాక్’ అంటూ బీచ్‌లో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.
‘జబర్దస్త్’ యాంకర్ అనసూయ తన తాజా ఫొటోలను పోస్ట్ చేస్తూ ‘అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు’ అంటూ ‘అతి త్వరలో’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది. కార్తికేయ హీరోగా 'చావు కబురు చల్లగా' చిత్రంలో తను నటించబోతున్న ఓ స్పెషల్ సాంగ్ కి సంబంధించిన ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.