తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పర్వతారోహకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అడ్వెంచర్ క్లబ్ ఛైర్మన్ రంగారావు స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని యూత్ హాస్టల్లో పర్వతారోహకుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పర్వతారోహణను 1989 నుంచి ప్రారంభించినట్లు వెల్లడించారు. ఎవరెస్టు శిఖరం ఎక్కిన వ్యక్తికి కూడా సరైన గుర్తింపులేని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్పోర్ట్స్ అథారిటీకి పర్వతారోహకుల పట్ల సరైన మార్గదర్శకాలు లేవని అవగాహన లేమితో పర్వతారోహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్వతారోహణ చేసిన వారే అని, ఇతర ఆటలకు ఇస్తున్న గుర్తింపు పర్వతారోహకులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తే మరిన్నీ విజయాలను సాధిస్తామని పర్వతారోహకులు ధీమా వ్యక్తం చేశారు.
పర్వతారోహకులకు సరైన గుర్తింపు ఇవ్వండి - పర్వతారోహణ
ఇరు రాష్ట్రాల పర్వతారోహకులకు ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలని అడ్వెంచర్ క్లబ్ తెలిపింది. క్రీడాకారును ప్రోత్సాహించిన విధంగానే తమను ప్రోత్సహించాలని కోరుతున్నారు.
పర్వతారోహకులకు సరైన గుర్తింపు ఇవ్వండి