రాష్ట్రంలో సోనా బియ్యం వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని... ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రవీణ్‌రావు తెలిపారు. తెలంగాణ సోనా బియ్యం వినియోగం పెంపు కోసం విశ్వవిద్యాలయం, బేపాక్ ఫోర్‌ఎక్స్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
సోనా బియ్యం వినియోగం పెంపు కోసం కుదిరిన అవగాహన - పీజేటీఎస్ఏయూ, బేపాక్ ఫోర్ ఎక్స్ సంస్థ మధ్య ఒప్పందం
తెలంగాణ సోనా బియ్యం వినియోగం పెంపు కోసం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బేపాక్ ఫోర్‌ఎక్స్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఉపకులపతి సమక్షంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్, బేపాక్ ఫోర్‌ఎక్స్ డైరెక్టర్ ఉదయ్‌నదీవాడే... ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.
సోనా బియ్యం వినియోగం పెంపు కోసం కుదిరిన అవగాహన
ఉపకులపతి సమక్షంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్, బేపాక్ ఫోర్‌ఎక్స్ డైరెక్టర్ ఉదయ్‌నదీవాడే... ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం స్వల్పకాలిక వరి రకం తెలంగాణ సోనా.... ఆర్ఎన్ఆర్ 15408 వంగడం 2015లో విడుదల చేసింది. ఈ బియ్యంలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి అన్నం నాణ్యత మధుమేహ వ్యాధిగ్రస్తులు తినేందుకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఇదే స్ఫూర్తి అవసరం: కేటీఆర్