ట్రాఫిక్‌ను కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు ఎంతగా శ్రమిస్తోన్న.. జనం మాత్రం అస్సలు మారడం లేదు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోన్నా.. వాహనదారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజగా అలాంటి ఓ వాహనదారుడినే.. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఆ బైక్‌కు సంబంధించి.. పెండింగ్‌లో ఉన్న చలానాల లిస్టు చూసి అవాక్కయ్యారు.
అమ్మ బాబోయ్.. ఆ బైక్‌పై అన్ని చలాన్లా..! - బైక్‌పై వేలల్లో చలాన్లు
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే.. చలానాలు ఎక్కడ పడతాయోన్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. బకాయిలు ఏవైనా ఉంటే నెత్తి మీద భారంలా అనిపిస్తుంటుంది. వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయమేస్తుంటుంది. అలాంటిది ఓ మహానుబావుడు మాత్రం.. ఎన్నిసార్లు ఫైన్లు వేసినా బైక్‌ను నడుపుతూనే ఉన్నాడు. ఆఖరికి పోలీసులకు చిక్కనే చిక్కాడు.
pending challans
పట్టణంలోని రాజీవ్ చౌక్‌లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా.. పోలీసులు తిమ్మాపూర్ తండాకు చెందిన రవి అనే వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేశారు. బైక్‌పై మొత్తం 13 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి షాకయ్యారు. బకాయిల మొత్తం విలువ.. రూ. 10 వేలకు పైనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ముందు చలాన్లు క్లియర్ చేయమని చెప్పి.. బండిని సీజ్ చేసి అతడిని అక్కడినుంచి పంపించేశారు.
ఇదీ చదవండి:విచారణకు వెళ్లిన పోలీసుల వాహనంపై రాళ్ల దాడి