తెలంగాణ

telangana

ETV Bharat / state

వీడియో వైరల్​: మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్​ సస్పెండ్​ - ఉద్యోగి వసూళ్ల పర్వం

అతను రవాణా శాఖలో ఓ ఉద్యోగి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు నడిపేవారికి జరిమానా విధించడం ఆయన విధి. కానీ ఆ అధికారి యూనిఫామ్ ధరించకుండా సాధారణ వస్త్రాలు వేసుకుని వాహనాలను ఆపుతాడు. చోదకుల దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. కొన్ని రోజులుగా ఇదే తంతును కొనసాగిస్తున్నాడు. ఆ తతంగాన్ని చూసి ఓ బాధితుడు తన చరవాణితో వీడియో తీశాడు. సామాజిక మాధ్యమాల్లో నిక్షిప్తం చేశాడు. దాంతో ఆ ఉద్యోగి వసూళ్ల పర్వం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అయ్యింది. ఆ తరువాత ఏం జరిగింది?

Motor Vehicle Inspector Suspended
వీడియో వైరల్​: మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్​ సస్పెండ్​

By

Published : Nov 6, 2020, 11:05 PM IST

వీడియో వైరల్​: మోటార్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్​ సస్పెండ్​

అవినీతి ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్​ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మోటార్ వెహికిల్ ఇన్​స్పెక్టర్ మృత్యుంజయరావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ సీతా రామాంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లి గూడెం బైపాస్ రహదారిపై నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు ఛలానాలు రాయకుండా, కేసులు నమోదు చేయకుండా లంచం తీసుకుని వదిలేశారని ఆయనపై వేటు పడింది.

వచ్చీపోయే చోదకుల నుంచి లంచాలు వసూళ్లు చేస్తున్నారని.. యూనిఫాం ధరించకుండా ఇలా చేస్తున్నాడని... ఆధారాలతో సహా ఓ బాధితుడు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో రవాణాశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నిజమేనని తేలడంతో మృత్యుంజయరావును తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details