తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆగ్ల భాషను నెత్తిన ఎక్కించుకోకూడదు' - telugu bhasa celebrations in hyderabad

పరభాష వ్యామోహంలో మాతృభాష నిర్లక్ష్యానికి గురవుతోందని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ ఎన్.గోపి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో డాక్టర్ మలుగ అంజయ్య అవధానిచే అష్టావధాన కార్యక్రమం జరిగింది.

mother tongue day celebrations
'ఆగ్ల భాషను నెత్తిన ఎక్కించుకోకూడదు'

By

Published : Mar 13, 2020, 5:47 PM IST

మాతృభాషపై పట్టు సాధించకుండా ఏ భాషలోనూ రాణించలేమని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్​ ఎన్​.గోపి పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం పురష్కరించుకుని హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో జరిగిన అష్టావధాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

పిల్లలు ప్రాథమిక, మాధ్యమిక దశలో మాతృభాషను నేర్చుకోవడం వల్ల సృజనాత్మకత పెంపొందుతుందని స్పష్టం చేశారు. ఆంగ్ల భాషను మన చెలికత్తెగా తీసుకెళ్లాలిగాని నెత్తిన ఎక్కించుకోవద్దని సూచించారు. డాక్టర్ కావూరి శ్రీనివాస్, గొంటుముక్కల గోవింద్, కొత్తోజు జనార్దనాచారి, బీవీవీ సత్యనారాయణకు మతృభాష పురస్కారాలను ప్రదానం చేశారు.

'ఆగ్ల భాషను నెత్తిన ఎక్కించుకోకూడదు'

ఇదీ చూడండి:వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి

ABOUT THE AUTHOR

...view details