ఏపీలోని చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. బాలాజీ కాలనీలో నివాసముంటున్న వెంకటరమణకు గౌతమితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. గత కొంత కాలంగా గౌతమికి, వెంకటరమణతో గొడవలు జరుగుతున్నాయి.
ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య - news updates in chitthore district
కుటుంబ కలహాలతో ఓ తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీ చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళ్యంలో జరిగింది.
![ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8762968-419-8762968-1599818206627.jpg)
ఇద్దరు కుమారులతో సహా తల్లి ఆత్మహత్య
ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె... తన ఇద్దరు కుమారులతో సహా చల్లగుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాలను గమనించిన స్థానిక రైతులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.