అప్పుడే పుట్టిన ఓ మగ శిశువును వదిలేసి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళను గాంధీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కామారెడ్డికి చెందిన మంజుల ప్రసవం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరింది. పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవానికి గాంధీకి వచ్చిన మంజులతో పాటు ఆమె భర్త రాలేదు. కాగా.. శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది.
అమ్మ వదిలేద్దామనుకుంది.. పోలీసులు కాపాడారు! - undefined
ఓ మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చిన సంఘటన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
అమ్మ వదిలేద్దామనుకుంది.. పోలీసులు కాపాడారు!
విషయం గమనించిన ఆసుపత్రి సిబ్బంది.. మంజులను ప్రశ్నించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గాంధీ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు శిశువును, తల్లిని చిలకలగూడ పోలీస్ స్టేషన్కి తరలించారు. తల్లీబిడ్డలను దిశ కేంద్రానికి తరలించారు.