ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరులో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన కొడుకును కన్నతల్లి హతమార్చింది. గ్రామానికి చెందిన ఆనందబాబు తాగుడుకు అలవాటుపడ్డాడు. మద్యానికి డబ్బుల కోసం తరచూ తల్లిని వేధించేవాడు. ఆ అలవాటు మానుకోమని ఎన్నిసార్లు చెప్పినా అతను వినలేదు.
మద్యానికి బానిసైన కుమారుడు.. హతమార్చిన కన్నతల్లి - కృష్ణా జిల్లా క్రైమ్ వార్తలు
మద్యం.. ఈ మహమ్మారి కారణంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. తాగీతాగీ చనిపోయేవారు కొందరు. తాగుడుకు బానిసై కుటుంబీకుల ఆగ్రహానికి బలయ్యేవారు కొందరు. ఓ తాగుబోతు కొడుకు విషయంలో సహనం కోల్పోయిన ఓ తల్లి హంతకురాలైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బొమ్మలూరులో జరిగింది.
mother-killed-son-in-bommaluru-krishna-district
గత రాత్రి ఇదే విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ తారస్థాయికి చేరగా... సహనం కోల్పోయిన ఆనందబాబు తల్లి.. ఇంట్లో ఉన్న వస్తువులతో అతనిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డ ఆనందబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.