Mother Daughter Bonding Tips Telugu : ఎక్కడైనా మనం అత్తాకోడళ్ల మధ్య గొడవలు చూస్తాం. వాళ్ల ఇద్దరికి పడకపోవడం.. అత్తతో గొడవ వల్ల వేరే కాపురం పెట్టడం వంటివి చూస్తుంటాం. క్లియర్గా చెప్పాలంటే అత్తాకోటళ్ల మధ్య గొడవ అనేది ప్రతి ఇంట్లో సర్వసాధారణం. అయితే ఇక్కడ మాత్రం రివర్స్. అత్తగారింట్లో ఉండటం ఈ మహిళకు ఇష్టం. కానీ ఆమె తల్లికి మాత్రం ఇష్టం లేదు. అత్తగారింట్లో ఏదైనా సమస్య వస్తే సర్దుకు పోయి ఉండమని కూతుళ్లకు సర్దిచెప్పే తల్లులను చూశాం.
కానీ ఈ తల్లి మాత్రం కాస్త డిఫరెంట్. ఎలాంటి కలహాలు లేకుండా హాయిగా సాగిపోతున్న కూతురును వేరు కాపురం పెట్టమని ఎంకరేజ్ చేస్తోంది. కానీ ఆ కూతురేమో తనకు అత్తగారింట్లో ఉండటమే ఇష్టమంటోంది. ఈ విషయం తన తల్లికి చెప్పినా అర్థం చేసుకోవడం లేదట. గట్టిగా చెబుదామంటే తల్లితో అలా మాట్లాడటం సరికాదనిపిస్తోందట. మరి ఈ మహిళ సమస్యకు మన రిలేషన్షిప్ అడ్వైజర్ ఏం సలహా ఇచ్చారో ఓసారి చూద్దామా..? ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చదివేయండి.. మీకూ ఇలాంటి సమస్య వస్తే ఎలాంటి పరిష్కారం ఆలోచించాలో ఇది చదివి తెలుసుకోండి.
భూమి కోసం అత్తాకోడలు పోరాటం.. కలెక్టరేట్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం.!
'చాలా కుటుంబాల్లో అత్తాకోడలి మధ్య గొడవలు రావడం సాధారణంగా చూస్తుంటాం (Mother in Law and Daughter in Law Fights). కానీ మీ విషయంలో భిన్నంగా మీ అమ్మగారి వల్ల సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. మీ అమ్మగారితో సమస్య ఉందని నిజాయితీగా చెప్పుకోవడం అభినందనీయం. అయితే ఒక కోడలిగా మీ అత్తగారితో ఎంత సఖ్యత అవసరమో మీ అమ్మగారితో కూడా అంతో ఉండాలి. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమను మించిన ప్రేమ మరొకటి ఉండదు. కాబట్టి మీ అమ్మగారితో ఎలాంటి గొడవలు లేకుండా సమస్యను పరిష్కరించుకోడానికి ప్రయత్నించండి.