తెలంగాణ

telangana

ETV Bharat / state

Mothers Committed Suicide : మదర్స్​ డేనే.. నీటి టబ్బులో ముంచి ఒకరు.. విషం ఇచ్చి మరొకరు.. - పది నెలల చిన్నారితో తల్లి ఆత్మహత్య

Mothers Committed Suicide With Childrens : మాతృమూర్తి అన్న పదానికే మచ్చ తెచ్చే విధంగా ఈ తల్లులు వ్యవహరించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలను భూతద్దంలో చూసి.. అభంశుభం తెలియని పిల్లలను చేజేతూలా బలి తీసుకున్నారు. ఒకరు టబ్బులో ముంచి చంపితే.. ఇంకొకరు విషం ఇచ్చి చంపేశారు. ఈ రెండు ఘటనలు హైదరాబాద్​లో జరిగాయి.

commited suicide
commited suicide

By

Published : May 14, 2023, 10:40 PM IST

Mothers Committed Suicide With Childrens : మాతృ దినోత్సవం రోజునే ఇద్దరు మాతృమూర్తులు దారుణం ఒడిగట్టారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలనే.. ఆలూమగల మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలతో చేజేతులా హతమార్చుకున్నారు. హైదరాబాద్​ నగరంలోని లలితనగర్​లో కుటుంబ కలహాలతో తమ ఇద్దరి కుమారులను నీటి టబ్బులో ముంచి అనంతరం.. ఆమె కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా.. చిన్నారుల తల్లి పరిస్థితి మాత్రం విషయంగా ఉంది. ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న​ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కుభ్య తండాకు చెందిన శ్రీనివాస్​, భారతిలకు 2020లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కలరు. శనివారం ఉదయం శ్రీనివాస్​ తల్లి ఇంటికి వచ్చి.. ఆ పసిపిల్లలను ఎత్తుకునేందుకు ప్రయత్నించింది. దీంతో భారతి అత్తతో తన పిల్లలను ముట్టుకోవద్దని గొడవ పెట్టుకుంది. ఆ గొడవ కాస్త పెద్దదై భార్యాభర్తల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇక్కడితో ఆగకుండా ఆమె తల్లిదండ్రులు ఇంటికి వస్తే వారి ముందు కూడా మరోసారి గొడవ పడ్డారని స్థానికులు తెలిపారు.

భర్తపై కోపంతో.. పిల్లల ప్రాణాలు తీసింది: దీంతో భర్త ఇంటిని బయటకు వెళ్లిపోయాడు.. కోపంతో ఆ ఇల్లాలు తన ఇద్దరి పిల్లలను నీటి టబ్బులో ముంచి.. ఆ తర్వాత ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకొంది. ఇదే విషయాన్ని భర్తకు ఫోన్​ చేసి ఆమె చెప్పడంతో.. అతను వెంటనే వచ్చి ఇద్దరి పిల్లలను కొత్తపేటలోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయారని తెలిపారు. ఆ తర్వాత ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

భర్త పెళ్లికి రాలేదని.. చిన్నారితో భార్య ఆత్మహత్య : మరోవైపు ఓ గృహిణి తన పది నెలల చిన్నారితో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్​లోని ముషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్​ బాకారం రాంనగర్​కు చెందిన విజయసాగర్​తో అంబర్​ పేట్​కు చెందిన విజయ వసంత కుమారికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2022లో లేకలేక చిన్నారి జన్మించింది. ఈ నెల మూడో తేదీన ఆమె తన అన్న వివాహానికి కేవలం తనకు మాత్రమే చెప్పి.. తన భర్తకు చెప్పకపోవడంతో ఆయన నిరుత్సాహానికి గురయ్యాడు.

ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరూ వివాహానికి వెళ్లలేదు. ఈ విషయంపై తీవ్రమనస్తాపానికి గురైన వసంతకుమారి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి.. తనతో పాటు చిన్నారికి తాగించింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముషీరాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details