Suicide Attempt: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఆర్ఎస్ పేటలో తల్లీకుమారుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. బలభద్రపురంలో తమ ఇంటిని కూల్చివేశారని.. బాధితులు కామాక్షి, మురళికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. న్యాయం జరగలేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ చావుకు వైకాపా నేతలు దుర్గారావు, అప్పారావు, భీమన్న వీర్రాజు కారణమంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
ఆ పార్టీ అరాచకాలు.. ఇంటిని కూల్చివేశారని తల్లీకుమారుల ఆత్మహత్యాయత్నం - Common people
Suicide Attempt: నాయకుల అరాచాలకు అంతూ లేకుండా పోతోంది. వారు చేసే అరాచాలకు సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా నాయకులు ఇంటిని కూల్చివేశారని తల్లికుమారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Suicide
అచేతన స్థితిలో పడి ఉన్న బాధితులను స్థానికులు అనపర్తి ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. వైకాపా నేతల వేధింపులే.. తల్లీకుమారుల ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: