మాతృమూర్తులకు వందనం - mothers days
కరోనా తెచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. వలసజీవుల జీవనోపాధిని దారుణంగా దెబ్బతిస్తోంది. స్థానికంగా పని లేక.. చేతిలో చిల్లిగవ్వలేక.. కాలి నడకనే సొంత గ్రామాలకు పయనమవుతున్న వారెందరో. తలమీద బరువు, సంకలో పిల్లలను పెట్టుకొని వందల కీలోమీటర్లు నడుచుకుంటూ... వెళ్తున్న మాతృమూర్తులు ఎందరో.. హైదరాబాద్ నగర శివారులో నాగ్‌పుర్ జాతీయ రహదారిపై పిల్లల్ని చంకనెత్తుకుని.. వందల కిలోమీటర్లు నడుచుకుంటూ బయలుదేరారు ఈ తల్లులు. మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు...
మూతృమూర్తులకు వందనాలు...