14 Feets King Cobra in ap: ప్రపంచంలోనే విషపూరిత పాముల్లో అతిపెద్దదైన కింగ్ కోబ్రా అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో కలకలం రేపింది. పామాయిల్ తోటలో కూలీలు గెలలు కోస్తుండగా కనిపించింది. భారీ పామును చూసిన కూలీలు భయభ్రాంతులతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్స్కు సమాచారం అందించారు. సభ్యులు వెంకటేష్, మూర్తి సంఘటనాస్థలానికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి.. కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. పాము పొడవు 14 అడుగుల వరకు ఉండొచ్చని తెలిపారు.
ఇంత పెద్ద కింగ్ కోబ్రానా.. ఎక్కడ అసలు? - ap latest news
14 Feets King Cobra in ap: రోజూలాగే ఇవాళ కూడా పామాయిల్ తోటలో పనికి వెళ్లారు. అక్కడకు వెళ్లిన కూలీలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. 14 అడుగుల కింగ్కోబ్రాను చూసి పరుగులు తీశారు. అనంతరం స్నేక్ క్యాచర్స్కు సమాచారమివ్వగా.. పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
కింగ్ కోబ్రా
ఈ కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. పర్యావరణ సమతుల్యత కోసం వీటిని రక్షించుకోవాలని వన్యప్రాణి సంరక్షణ సభ్యులు సూచించారు. బంధించిన కింగ్ కోబ్రాను వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి:
TAGGED:
భారీ నాగు పాము