Mosque, Church, and Temple in New Telangana Secretariat: సాంకేతిక సదుపాయాలతో రూపకల్పన చేసి సచివాలయ నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించి.. పాత సచివాలయాన్ని కూల్చివేసింది. సరైన సదుపాయాలు, అగ్నిమాపక నిరోధక వ్యవస్థ లేదని నూతన సచివాలయ నిర్మాణానికి తెరలేపింది. పాత భవనాన్ని కూల్చే ప్రక్రియలో సచివాలయంలోనే ఉన్న ఆలయం, మసీదు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్… ఆలయం, మసీదులను ప్రభుత్వ ఖర్చుతో మరింత విశాలంగా నిర్మిస్తామని అప్పుడే హామీ ఇచ్చారు.
Telangana Secretariat: త్వరలోనే చర్చి, ఆలయ నిర్మాణాలకు శ్రీకారం
Temples in Telangana Secretariat: సచివాలయ ప్రాంగణంలో గతంలో ఉన్న మసీదులు, ఆలయం, చర్చిలను పాత భవనాల కూల్చివేత సందర్భంగా తొలగించారు. వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు (Mosque, Church, and Temple in New Telangana Secretariat) చేపడతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇందులో భాగంగానే గురువారం మసీదుల నిర్మాణ పనులను (Foundation For Mosque at Secretariat) ప్రారంభించగా.. దేవాలయం, చర్చిల నిర్మాణ పనులకు కూడా రంగం సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలోనే కొత్త సచివాలయ ప్రాంగణంలో మసీదుల నిర్మాణపనులను (Foundation For Mosque at Secretariat) ప్రారంభించారు. దేవాలయం, చర్చిల నిర్మాణ పనుల ప్రారంభానికి కూడా రంగం సిద్ధమవుతోంది. ఒక్కో ప్రార్థనా మందిరానికి 1500 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. మసీదు నిర్మాణం కోసం ఇప్పటికే శంకుస్థాపన కూడా చేశారు. దేవాలయం, చర్చి నిర్మాణ పనుల ప్రారంభానికి కూడా సిద్ధమవుతున్నారు. సచివాలయ నమునాలను రూపొందించిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్ సంస్థ ప్రార్థనా మందిరాల నమూనాలను కూడా రూపొందించింది. ఆలయ నిర్మాణ బాధ్యతను దేవాదాయ శాఖకు అప్పగించిన ప్రభుత్వం... చర్చి నిర్మాణ బాధ్యతలను సంబంధిత సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది.
ఇదీ చూడండి:Telangana Secretariat Mosque: సచివాలయంలో టర్కీ తరహా మసీదు.. నిర్మాణ పనులు ప్రారంభం