ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్ చేసి సామజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు తెరాస లీగల్ సెల్ విభాగం ఫిర్యాదు చేసింది.
సీఎం ఫొటోలు మార్ఫింగ్.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు - సామజిక మాధ్యమాల్లో కేసీఆర్ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు
జీహెచ్ఎంసీ ఎన్నికల తరుణంలో పలువురు ఆకతాయిలు సీఎం కేసీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేశారు. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టేశారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గుర్తించిన తెరాస లీగల్ సెల్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
సీఎం ఫొటోలు మార్ఫింగ్.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కొన్ని రాజకీల పార్టీలు ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కోరారు. ఫిర్యాదుతో పాటు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టులను జత పరిచి సైబర్ క్రైం పోలీసులకు సమర్పించారు.
ఇదీ చూడండి:చైతన్యపురి తెరాస ఉపాధ్యక్షుడి ఇంట్లో మద్యం సీసాలు
Last Updated : Nov 30, 2020, 7:57 PM IST