ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ
18:03 May 22
ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలు: డీజీపీ
ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు తీరును డీజీపీ స్వయంగా పరిశీలించారు. అత్యవసరమైతే కుషాయిగూడ, కూకట్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో పోలీస్ చెక్‌పోస్టులను పోలీస్ బాస్ పరిశీలించారు.
సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్ తర్వాతే అప్పగిస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైతే పాస్‌లు ఉన్నవారే బయటకు రావాలని... నకిలీపాస్‌లతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకే సరకు రవాణా వాహనాలకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఏ పనైనా ఉదయం 6 నుంచి 10 మధ్యే చేసుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి 10 వరకే ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి:'ఐడీ కార్డులు చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పొద్దు'