రాష్ట్రంలో కొత్తగా 1,050 కరోనా కేసులు, 4 మరణాలు - తెలంగాణలో తాజా కరోనా కేసులు
08:54 November 14
రాష్ట్రంలో కొత్తగా 1,050 కరోనా కేసులు, 4 మరణాలు
తెలంగాణలో కొత్తగా 1,050 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. 1,736 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మహామ్మారి బాధితుల సంఖ్య 2,56,713కు చేరింది. వైరస్‌తో ఇప్పటివరకు 1,401 మంది మృతి చెందగా.. 2,38,908 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 16,404 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,867 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 232 కరోనా కేసులు నమోదవగా.. మేడ్చల్ జిల్లాలో 90, రంగారెడ్డి జిల్లాలో 75 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:పండుగ ప్రత్యేకం... ఈ రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తామంటే...?