రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. మహమ్మారితో పోరాడి వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో జరిపిన నిర్ధరణ పరీక్షల్లో మరో 2,159 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,65,003కు చేరింది. ఒక్కరోజులో 9 మంది బలవ్వగా. మొత్తం మరణాల సంఖ్య 1005కు చేరింది.
రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు - తెలంగాణలో కరోనా వైరస్ వార్తలు
09:28 September 17
రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా మరణాలు
కరోనా నుంచి 2,108 కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తంగా వ్యాధి నయమై 1,33,555 మంది క్షేమంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 కరోనా యాక్టివ్ కేసులుండగా... 23,674 మంది హోం ఐసోలేషన్, ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 318 మంది పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లాలో 176, నల్గొండ జిల్లాలో 141, సిద్దిపేట జిల్లాలో 132 , కరీంనగర్ జిల్లాలో 127, మేడ్చల్ మాల్కాజిగిరి జిల్లాలో 121, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో 84 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాధి విస్తృతి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ నిబంధనలు ప్రజలు పాటించకపోవడం వల్లే వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి :ఈ నెల 19న ప్రారంభంకానున్న దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జి