ఛత్తీస్‌గడ్‌లోని కొర్బా జిల్లాకు చెందిన 40 మంది కార్మికులు సికింద్రాబాద్‌కి ఉపాధి కోసం వచ్చారు. మోడీ బిల్డర్స్ నిర్మిస్తున్న సూరారంలోని ఎలిగన్స్ అనే నిర్మాణ రంగ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు ఆగిపోవడం, రవాణా నిలిచిపోవడం వల్ల వీరంతా ఉపాధి కోల్పోయారు. లాక్డౌన్ కారణంగా చేతిలో పనిలేక, ఇంటికి కూడా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. తమను ఛత్తీస్‌గఢ్‌లోని తమ సొంతూళ్లకు తీసుకెళ్లమని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మికులు ప్రాధేయపడుతున్నారు. 6267632013 అనే నెంబరు నుంచి కార్మికులు తాము ఉంటున్న ప్రదేశం నుంచి వీడియో కాల్ చేశారు.
సికింద్రాబాద్‌లో చిక్కుకున్నాం.. ఆదుకోండి: ఛత్తీస్‌గఢ్ వాసులు - Korba mandir, korba news, korba administration
ఉపాధి నిమిత్తం ఛత్తీస్‌గడ్‌లోని కొర్బా జిల్లా నుంచి వచ్చిన 40 మంది కార్మికులు లాక్డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు.
![సికింద్రాబాద్‌లో చిక్కుకున్నాం.. ఆదుకోండి: ఛత్తీస్‌గఢ్ వాసులు More than 40 people are stranded in Telangana due to lock down.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6554159-267-6554159-1585235473709.jpg)
కొర్బా జిల్లాలోని పాళి, బీజ్రా, డూమెరుడా,పోడి ప్రాంతాల నుంచి కుటుంబసమేతంగా వచ్చిన వీరంతా ప్రాజెక్టుకు సంబంధించిన సైట్లోనే ఉంటూ అక్కడే వంట చేసుకుని తినేవారు. లాక్డౌన్ వల్ల పనులు ఆగిపోవడం, చేతిలో డబ్బులు కూడా అయిపోవడం వల్ల వారు తిండి గింజలు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. సొంతూరికి వెళ్దామని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి వచ్చి చూస్తే.. లాక్డౌన్ వల్ల రైళ్ల రాకపోకలు నిలిపివేశారని తెలిసింది. ఇక చేసేదేం లేక.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే ఇరుక్కుపోయారు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి, తినడానికి తిండి లేక, సొంతూరికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా తమను సొంతూళ్లకు పంపించమని వేడుకుంటున్నారు.