విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బందికి సంబంధించి రాష్ట్రంలో 2,127, ఆంధ్రప్రదేశ్లో 547 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. లోక్సభలో ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన.. ఏపీలో 6,557 పోస్టులకుగానూ 6,030 మంది తెలంగాణలో 5, 283 మందికి గానూ 3,156 మంది బోధన సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లాతో పాటు మక్తల్, కొడంగల్ శాసనసభ నియోజకవర్గాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని మరో ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
'రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2వేలకు పైగా ఖాళీలు' - telangana universities updates
విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బందికి సంబంధించి రాష్ట్రంలో 2,127 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.

2వేలకు పైగా ఖాళీలు