కొవిడ్ వాతావరణంలోనూ తక్కువ సమయంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం లక్షలాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించింది. సెప్టెంబరు 17 నుంచి తొలుత అన్ని కోర్సుల చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభించింది. తర్వాత మిగిలిన విద్యార్థులతోపాటు బ్యాక్‌లాగ్‌లకు నిర్వహించింది.
రికార్డని తెలిపిన అధికారులు
ఇప్పటివరకు 5,07,306 మంది వివిధ దఫాలుగా రాశారు. 14.74 లక్షల జవాబుపత్రాలు వర్సిటీకి అందాయి. ఇదో రికార్డని అధికారులు తెలిపారు. ఈ నెలలో 59 కోర్సులకు చెందిన మరో 55,585 మంది రాస్తారు. తొలిసారి పీజీ పరీక్షలకు ఓయూ పరిధి దాటి.. ఇతర జిల్లాల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేశామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఆన్‌స్క్రీన్ మూల్యాంకనంతో ఫలితాలు త్వరగా ఇస్తున్నామని అన్నారు.