తెలంగాణ

telangana

ETV Bharat / state

'30 డేకేర్​ కేంద్రాల్లో వృద్ధులకు  మరిన్ని సేవలు' - danakishore

గ్రేటర్​ పరిధిలోని సీనియర్ సిటిజన్లకు 30 డేకేర్ కేంద్రాల్లో యోగా, ఫిజియో థెరపీ, పాలియేటివ్ కేర్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. ఈ అంశాలపై జలమండలి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

'30డే కేర్​ కేంద్రాల్లో వృద్ధులకు  మరిన్ని సేవలు'

By

Published : Aug 10, 2019, 6:31 AM IST

గ్రేటర్​ పరిధిలోని 30 డేకేర్​ కేంద్రాల్లో ఈ నెల 14న సీనియర్ సిటిజన్లకు నిర్వహించే క్రీడా పోటీలపై జీహెచ్ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జలమండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యు.సి.డి. విభాగం ప్రాజెక్ట్ అధికారులు, ఆసరా కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపిక చేసిన 30 డేకేర్ కేంద్రాల్లో వారానికి మూడు రోజులు ప్రత్యేకంగా యోగా నిర్వహించేందుకు శిక్షకులను నియమిస్తామని దానకిశోర్ పేర్కొన్నారు. ఫిజియో థెరపిస్ట్​లను నియమించడమే కాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు పాలియేటివ్ కేర్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా నాలుగు వాహనాలు కేటాయించనున్నట్లు వివరించారు. ఈ కేంద్రాల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక తేదీల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు.

'30డే కేర్​ కేంద్రాల్లో వృద్ధులకు మరిన్ని సేవలు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details