కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ తీవ్రంగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదాలకు తాత్కాలికంగా బ్రేకు పడింది. లాక్‌డౌన్‌లో సడలింపులతో వ్యక్తిగత వాహనాలు, ప్రైవేటు రవాణా వాహనాలు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నందున ప్రమాదాలు మళ్లీ పెరిగిపోయాయి. రాత్రుళ్లు కర్ఫ్యూ సమయాలను మినహాయిస్తే... ఉదయం నుంచి సాయంత్రం వరకూ నగరం, శివారు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది. ట్రాఫిక్ పోలీసుల లెక్కల ప్రకారం.. మే నెలలో మొత్తం 103 ప్రమాదాలు జరిగితే అందులో అత్యధికంగా ద్విచక్రవాహనదారుల వల్లే 53 ప్రమాదాలు నమోదయ్యాయి.
లాక్‌డౌన్ తర్వాత మళ్లీ పెరిగిన రోడ్డు ప్రమాదాలు - లాక్‌డౌన్ తర్వాత మళ్లీ పెరిగిన రోడ్డు ప్రమాదాలు
లాక్‌డౌన్‌లో సడలింపులతో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రుళ్లు కర్ఫ్యూ సమయాలను మినహాయిస్తే... ఉదయం నుంచి సాయంత్రం వరకూ నగరం, శివారు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మే నెలలో మొత్తం 103 ప్రమాదాలు జరిగితే అందులో అత్యధికంగా ద్విచక్రవాహనదారుల వల్లే 53 ప్రమాదాలు నమోదయ్యాయి.
ప్రమాదాలు చేసిన వారిలో ఎక్కువమంది యువకులు, విద్యార్థులేనని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. లాక్‌డౌన్‌తోపాటు సెలవులు కలిసి రాగా స్నేహితులను కలుసుకునేందుకు, ఇతర పనులకు డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు రోడ్లపైకి బైకులు, స్కూటీలతో వస్తున్నారు. స్నేహితులను కలుసుకొని ఒకే బైక్‌పై ముగ్గురు చొప్పున వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో దూసుకెళ్లూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
దాటేందుకు దారిలేక...
నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు దాటేందుకు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఏర్పాట్లు లేక భయం భయంగా దాటాల్సి వస్తోంది. వేగంగా వస్తున్న వాహనాలను అంచనా వేయక, కంగారులో ముందుకు, వెనక్కూ ఊగిసలాడటం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, సికింద్రాబాద్, చిక్కడపల్లి, కోఠి, ఆబిడ్స్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది.