TRS President Election 2021: తెరాస అధ్యక్ష పోటీకి ఎన్ని నామినేషన్లు వచ్చాయో తెలుసా? - తెరాస పార్టీ వార్తలు
12:18 October 22
కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ ఇప్పటివరకు 18 నామినేషన్లు
తెరాస అధ్యక్ష పదవికి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల (TRS President Election 2021) గడువు ముగియనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ మరో 2 నామినేషన్లు (Nominations for TRS President Election 2021) దాఖలయ్యాయి. కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఇప్పటివరకు 18 నామినేషన్లు (Nominations for TRS President Election 2021) వచ్చాయి.
గిరిజన, రైతు విభాగాల నేతలు మరో రెండు నామినేషన్లు (Nominations for TRS President Election 2021) దాఖలు చేశారు. రేపు (శనివారం) తెరాస అధ్యక్ష ఎన్నిక నామినేషన్లు పరిశీలించనున్నారు. ఆదివారం వరకు తెరాస అధ్యక్ష ఎన్నిక నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో తెరాస అధ్యక్షుడి (TRS President Election 2021)గా మరోసారి కేసీఆర్ ఎన్నిక లాంఛనం కానుంది.
ఇదీ చూడండి:TRS President Election 2021: తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్ తరఫున మరిన్ని నామినేషన్లు