రోబోటిక్స్ సేవలందించే కంపెనీలకు మరిన్నీ ప్రోత్సాహకాలు అందిస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. ఈ రంగంలో భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. యువత కొత్త సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్‌ను(ఐరా) ఆయన ప్రారంభించారు.
రోబోటిక్స్ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు: జయేశ్ రంజన్ - హైదరాబాద్ వార్తలు
భవిష్యత్తులో రోబోటిక్స్ రంగంలో మంచి ఉపాధి అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. హైదరాబాద్‌లో ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్‌ను ఆయన ప్రారంభించారు.

రోబోటిక్స్ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు: జయేశ్ రంజన్
హైదరాబాద్ రోబోటిక్స్ కంపెనీలు, అంకురాలు దేశవ్యాప్తంగా విస్తరించడం శుభపరిణామమని ఆయన అన్నారు. ఈ రంగం ఎమర్జింగ్ టెక్నాలజీ అయినందు వల్ల తాము పూర్తి సహకారం అందిస్తామని జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. నగరంలో రోబో సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐరా అధ్యక్షురాలు హర్షిత తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు పెట్టుబడులకు, అంకురాలకు హైదరాబాద్‌ను హబ్‌గా తయారు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఇదీ చూడండి:ఎల్‌ఆర్‌ఎస్ గుదిబండలా మారింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Last Updated : Dec 15, 2020, 10:50 PM IST
TAGGED:
robotics centre in hyderabad