ఇతర దేశాలకు విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా, భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ఒప్పందం ప్రకారం జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయి, షార్జాలకు మూడు ఎయిర్‌లైన్స్ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి దుబాయికి వెళ్లి, తిరిగి రావడానికి ఎమిరేట్స్ లేదా ఫ్లై దుబాయి విమాన సర్వీసులు నడవనున్నాయి. షార్జా- హైదరాబాద్‌ల మధ్య ప్రయాణించాలనుకున్న వారు ఎయిర్ అరేబియా సర్వీస్ ద్వారా ప్రయాణాలు సాగించవచ్చని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.
వారానికి మూడు రోజుల సర్వీస్..
ఎమిరేట్స్ సహా ఫ్లై దుబాయి సర్వీసులు హైదరాబాద్, దుబాయి మధ్య వారానికి మూడు రోజుల సర్వీసులతో పున:ప్రారంభమయ్యాయి. ఎమిరేట్స్ మంగళ, గురు, ఆదివారాల్లో సేవలు అందిస్తే, ఫ్లై దుబాయ్ సోమ, బుధ, శనివారాల్లో సర్వీస్ ఆపరేట్ చేయనుంది. ఎయిర్ అరేబియా కూడా హైదరాబాద్, షార్జాల మధ్య వారానికి మూడు రోజుల సర్వీసులను పున: ప్రారంభించింది. ఇవి బుధ, శుక్ర, ఆదివారాల్లో అందుబాటులో ఉంటాయి.
మార్గదర్శకాల ఆధారంగా..
కేంద్ర హాంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దుబాయి, షార్జాలకు ఆయా ఎయిర్ లైన్స్ నుంచి తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయాణికులంతా కొవిడ్-19 మార్గదర్శకాలకు లోబడే ప్రయాణాలు సాగించాలని సూచించాయి.
పూర్తిగా శానిటైజ్ చేశాకే..