తెలంగాణలోని దిగువ జిల్లాల వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని గాలులు బలహీనంగా ఉండటం వల్ల పురోగమనం జరగలేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
ఈ నెల 12లోపు రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు: వాతావరణ శాఖ - telangana varthalu
ఈ నెల 12లోపు రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలోని దిగువ జిల్లాల వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని గాలులు బలహీనంగా ఉండటం వల్ల పురోగమనం ఆశాజనకంగా జరగడం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ నెల 12లోపు రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు
ఈ ఏడాది సాధారణ వర్షాపాతం ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 11న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: మూడ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశం