Monsoon Diet in Telugu : రెండు మూడ్రోజుల నుంచి గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు ఏదైనా హాట్‌హాట్‌గా తింటే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకే ఇలా వాన తగ్గిందో లేదో.. అలా బయటకు వెళ్లి వేడివేడి మిర్చి బజ్జీలో.. పకోడినో.. తినేస్తుంటారు. ఇంకా ఈ వానాకాలంలో స్పైసీ ఫుడ్తినాలనిపిస్తుంది ఎక్కువ. అయితే సాధారణంగానే వర్షాకాలం.. తనతో వానతో పాటు జబ్బులను కూడా మోసుకొస్తుంటుంది. ఇక మీరు స్పైసీ, జంక్ ఫుడ్ తిన్నారనుకోండి మీ శరీరానికి కష్టాలు తప్పవు. అందుకే వానాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మరి ఈ మాన్సూన్లో మీ మనసుకు నచ్చే.. మీ శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాలేంటి..? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? ఏ పదార్థాలకు దూరంగా ఉండాలో ఓసారి తెలుసుకుందామా..?
Best Foods For Good Health in Monsoon : చాలామంది నూనెలో బాగా వేయించిన పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ కాలంలో ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి అంత మంచివి కాదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే వాతావరణంలో తేమ అధిక శాతం ఉంటుంది, శరీరంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో నూనె సంబంధిత ఫుడ్ తినడంఆరోగ్యానికి అంతగా మంచిది కాదంటున్నారు వైద్యులు. అంతేకాకుండా ఫ్రై చేసిన ఆహార పదార్థాల వల్ల శరీరంలో అనవసర కొవ్వు నిల్వలు పెరుగుతాయని.. ఊబకాయం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలంలో ఫ్రైడ్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
Fruits To Eat During Periods : నెలసరి సమయమా? ఈ పండ్లు తీసుకుంటే.. మీ హెల్త్‌కు డోకా ఉండదు!
Foods To Avoid in Monsoon :వర్షాకాలంలో బయట ఫుడ్ తింటారు అలా తినడం వల్ల విరేచనాలు, పచ్చకామెర్లు వంటి సమస్యల బారిన పడక తప్పదు. బయట దొరికే పదార్థాల తయారీలో పరిశుభ్రమైన నీరు వాడకపోవడం ఒక కారణం. వాన పడుతున్నప్పుడు బయట ఆహారానికి స్వస్తి పలకడమే ఉత్తమం. కనీసం జూస్ అయినా తాగుదాం అనుకుంటే అది కూడ పొరపాటే.. అంతగా తాగాలి అనుకుంటే ఇంట్లోనే శుభ్రంగా తయారుచేసుకొని తాగడం మంచిది.
ఆకుకూరలు తింటున్నారా జాగ్రత్త : వర్షాకాలంలో ఆకుకూరల విషయంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎందుకంటే ఇవి మట్టిలో పెరుగుతాయి. వీటిని నేరుగా నేల నుంచి పీకి కట్టలు కట్టి అమ్ముతుంటారు. అందులో ఉండే తేమ వల్ల మట్టిలో ఉండే పలు రకాల క్రిములు మొక్కల్లో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని రకాల పురుగులు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చాలా మంది వాటిని గమనించరు. ఫలితంగా వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ క్రిములు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తాయి అలా ఆరోగ్యం పాడవుతుంది. వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటిని నిశితంగా పరిశీలించి తీసుకోవాలి. ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి, ఆ తర్వాతే వండుకోవాలి. అలాగే ఈ కాలంలో పుట్టగొడుగులకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇతర కూరగాయలను కూడా శుభ్రంగా కడిగి మరీ వండుకోవడం ఉత్తమం.