ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జెండా చెట్టు బజారులో.. తాపీ మేస్త్రి చాంద్ బాషా నివాసముంటాడు. తన ఇంటి వరండాలో మంచం మీద సెల్ ఫోన్ పెట్టి పక్కకు వెళ్లగా.. ఇంతలో అక్కడికొచ్చిన కొండముచ్చు.. ఆ ఫోన్‌ను పట్టుకుని చెట్టెక్కేసింది. ఎంత ప్రయత్నించినా ఫోన్ వదల్లేదు. చేసేదేమీ లేక చాంద్ బాషా పోలీసులను ఆశ్రయించాడు. తన సెల్‌ఫోన్‌ను కొండముచ్చు ఎత్తుకుపోయిందని ఫిర్యాదు చేశాడు. ఖంగుతిన్న పోలీసులు ఫోన్ ఎలా తీసుకురావాలా అని తలలు పట్టుకున్నారు.
విచిత్రం... కొండముచ్చుపై పోలీసులకు ఫిర్యాదు
పోలీసు స్టేషన్‌కు ఓ వ్యక్తి వచ్చాడు. తన సెల్ ఫోన్ చోరీకి గురైందని ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదుకు పోలీసులు షాక్ అయ్యారు. ఫిర్యాదు చేస్తే షాక్ ఎందుకంటారా..? అదంతే చోరీ చేసింది ఏ గజ దొంగో కాదు... ఓ కొండముచ్చు. ఇంతకూ ఎలా ఎత్తుకెళ్లింది అంటారా? చదవండి.
నా ఫోన్‌ను కొండముచ్చు ఎత్తుకుపోయింది!