తెలంగాణ

telangana

ETV Bharat / state

వానర వర్గ పోరు... నరులకు తిప్పలు! - monkey

ఏపీలోని అనంతపురం - కల్యాణదుర్గ నియోజకవర్గ కేంద్రం నడి రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలంతా...రెండు వర్గాల మధ్య జరిగే పోరును తిలకిస్తున్నారు. అరే... ఆపేవారు లేరే అనుకుంటున్నారా? ఆపితే వారి మీదకు వస్తారనే భయం. ఇంతకీ వర్గ పోరు ఎవరి మధ్య తెలుసా! వానర సమూహాల మధ్య.

వానర వర్గ పోరు... నరులకు తిప్పలు!

By

Published : Aug 14, 2019, 12:06 AM IST

వానర వర్గ పోరు... నరులకు తిప్పలు!

అటు ఓ వానర సమూహం... ఇటు ఓ వానర సమూహం. ఇరు వర్గాల మధ్య సంవాదం. ఫలితంగా... అరగంటకు పైగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమో... ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గ నియోజకవర్గ కేంద్రంలో రెండు వానర సమూహాలు భీకర యుద్ధానికి దిగాయి. అనంతపురం - కల్యాణదుర్గం ప్రధాన రోడ్డు డివైడర్​పై యుద్ధానికి కాలు దువ్వుకున్నాయి. ఒక వర్గంపై మరో వర్గం దాడికి తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ తతంగమంతా అక్కడున్న ప్రజలు కాస్త ఆనందంతో, ఆసక్తితో తిలకించగా ట్రాఫిక్​కు పెద్ద అంతరాయం కలిగింది. చివరికి ఓ గుంపు.. ఎక్కువగా బెదిరించగా.. ఈ వానర బాహుబలుల యుద్ధం ఆగిపోయింది.

ABOUT THE AUTHOR

...view details