అన్నీ మానవులకేనా... మాకొద్దా..? - ananthapuram latest news
మనిషికి అనారోగ్యం చేస్తే ఆసుపత్రికి వెళ్లి సెలైన్ ఎక్కించుకుంటాడు. అదే జంతువులకు రోగం వస్తే అవి ఆసుపత్రికి పోలేవు. కాని ఉరవకొండలో ఓ వానరం ఆస్పత్రికి వచ్చి సెలైన్ తాగింది.
![అన్నీ మానవులకేనా... మాకొద్దా..? monkey-drinking-selain-at-urvakonda-in-ananthapuram-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7742503-991-7742503-1592928233117.jpg)
అన్నీ మానవులకేనా... మాకొద్దా..?
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ వానరం సెలైన్ తాగింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని క్యాజువల్ గదిలోకి వెళ్లిన వానరం... బీరువాలోని సెలైన్ బాటిల్ కొరికి తాగేసింది. ఇంకో సెలైన్ బాటిల్ తీసుకోని ఎంచక్కా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆస్పత్రికి వచ్చిన రోగులు, అక్కడున్న ఆస్పత్రి సిబ్బంది కోతి చేష్టలు చూసి నవ్వుకున్నారు.
అన్నీ మానవులకేనా... మాకొద్దా..?
- ఇదీ చదవండి: జింకను కాపాడి.. అధికారులకు అప్పగించిన యువకులు