ఇంటి నుంచి బయటికి ఇంకా అడుగుపెట్టని తన కూతురికి దగ్గు, ఆయాసం రావడంతో వైద్యులను సంప్రదించింది మోనీషా. బయట వ్యర్థాలను కాలుస్తుంటే, వాటి నుంచి వచ్చే పొగ ఈ అనారోగ్యానికి కారణమని తెలుసుకుంది. అదే ఆమెను ఆలోచించేలా చేసింది. ప్రతి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలను తగ్గించగలిగితే, ఈ సమస్యను కొంతైనా అదుపు చేయొచ్చు అనుకుంది. దాంతో ఇంటి చుట్టుపక్కలవారికి చిన్నచిన్నగా ఈ అంశంపై అవగాహన కలిగించడం ప్రారంభించింది. దాంతోపాటు వంటింటి వ్యర్థాలతో పెరటితోటను పెంచడమే కాదు, వాటి నుంచి పండే తాజా కూరగాయలతో ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా ఉండొచ్చని చేసి చూపింది.
తాము ఉంటున్న సముదాయంలో గృహిణులందరినీ ఓ గ్రూపుగా చేసింది. వ్యర్థాలను ఎరువుగా మార్చడం, వాటితో మొక్కల పెంపకం వంటి వాటిపై వర్క్‌షాపులు నిర్వహించేది. నాలుగేళ్లు శ్రమ పడ్డాక చుట్టుపక్కల వారంతా ఈ విధానాన్ని పాటించడం మొదలుపెట్టారు. వారిలో కొందరి వలంటీర్లుగా మారేలా స్ఫూర్తి కలిగించింది మోనీషా. ఈకో బజార్స్, ఈకో అవేర్‌నెస్ వర్క్‌షాప్స్ నిర్వహించేలా శిక్షణనిచ్చింది. అలా 2009లో ఈ గ్రూపు ‘రుర్ (రెడ్యూసింగ్, రీయూజింగ్, రీసైక్లింగ్)’ పేరుతో 100 సైట్లలో 200కు పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. బయో కంపోస్టర్స్ ద్వారా దాదాపు 30 లక్షలమంది ఈ పద్ధతిపై అవగాహన పొంది, ఈ 12 ఏళ్లలో ఏటా 750 టన్నులకు పైగా వ్యర్థాలను రీసైకిల్ చేస్తున్నారు. వీరిలో కొందరు తాము తయారు చేసిన కంపోస్ట్‌ను విక్రయించే స్థాయికీ ఎదిగారు.
రీసైకిల్‌గా...