తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బే హత్యకు కారణం - friends

డబ్బుల విషయంలో ప్రారంభమైన గొడవ.. హత్యకు దారితీసింది. మద్యం తాగించి రాయితో తలపై మోది చంపారు ఇద్దరు యువకులు.

హత్య

By

Published : Feb 12, 2019, 4:13 AM IST

స్నేహితులే హంతకులు
సికింద్రాబాద్ రాంగోపాలపేట్ పోలీస్​స్టేషన్ పరిధిలో ఈ నెల 7న జరిగిన రాహుల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులు సత్యనారాయణ, శ్రీనివాసరావులే చంపినట్లు విచారణలో తేలింది. వీరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

యాదాద్రి భువనగిరికి చెందిన సత్యనారాయణ, శ్రీనివాసరావులు బతుకుదెరువు కోసం హెదరాబాద్ వచ్చారు. వీరికి సికింద్రాబాద్ రాణిగంజ్​కు చెందిన రాహుల్​తో పరిచయం ఏర్పడింది. డబ్బుల విషయమై రాహుల్, సత్యనారాయణల మధ్య గొడవ ప్రారంభమైంది. పాతకక్షలు తోడై రాహుల్​ను చంపాలని నిర్ణయించుకున్నాడు. విషయం శ్రీనివాస్​కు చెప్పి.. పథకం వేశారు. మద్యం తాగించి రాయితో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details