Money is changing hands through Hawala in Hyderabad : ఒకవైపు ప్రపంచకప్ క్రికెట్ పండుగ(World Cup 2023).. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల జోరు ఉండటంతో బెట్టింగ్ ముఠాలు(Cricket Betting gangs) రంగంలోకి దిగాయి. ఒకేసారి రెండు అవకాశాలు రావడంతో బెట్టింగ్ మాయగాళ్లు.. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. దీంతో ఎక్కువ మొత్తంలోనే డబ్బు హవాలా మార్గంలో చేతులు మారుతోందని ఇంటెలిజెన్స్ చెబుతున్నాయి. దేశంలో ఎక్కడ బెట్టింగ్ జరిగినా ఆ మూలాలు హైదరాబాద్‌లో ఉంటాయని.. ఈ వారం వ్యవధిలోనే దాదాపు రూ.8 కోట్ల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. క్రికెట్ పందేలపై నిఘా ఉంచుతూ.. హవాలా వ్యాపారులు, దళారుల కదలికలపై దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపారు.
యాప్‌లు.. అంతర్రాష్ట్ర ముఠాలు, దేశ, విదేశాల్లో ఏ మూల క్రికెట్ పోటీలు జరిగినా హైదరాబాద్ నగరం కేంద్రంగా పందేలు జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్ ముఠాలను అరెస్టు చేస్తున్న నగరం పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్లలో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడిన 10 మంది పంటర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద రూ. కోటి విలువైన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచకప్ పుణ్యమా అని.. బెట్టింగ్ ముఠాలకు పంట పడుతున్నాయి.
IPL betting gang arrested: ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్టు... రూ.93లక్షలు సీజ్
World Cup Betting in Hyderabad : ప్రధాన బుకీలు పందెపురాయుళ్లుకు ఆన్లైన్, యాప్, వాట్సాప్ గ్రూపులతో దగ్గర అవుతున్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠాలు ఇప్పటికే నగరంలో తిష్ట వేసినట్లు విశ్వసనీయ సమాచారం. పందాళ్లో డబ్బులు పోగొట్టుకున్న బాధితులను బుకీలు పంటర్లుగా వాడుకుంటున్నారు. ప్రతి మ్యాచ్‌కు 10 నుంచి 20 శాతం వరకు కమీషన్ ఇస్తామని ఆశచూపుతున్నారని ఇంటెలిజెన్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం నగరంలో నాలుగైదు అంతర్రాష్ట్ర ముఠాలు పాగా వేసినట్లు సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు.