ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం అప్పన్న స్వామి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. గడిచిన 10 రోజుల్లో రూ.21,60,381 నగదు, 26 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి వస్తువులతో పాటు వివిధ దేశాలకు చెందిన డాలర్లు కూడా హుండీలో లభించాయని ఆలయ అధికారులు తెలిపారు.
సింహాచలం అప్పన్న ఆలయంలో హుండీ లెక్కింపు - సింహాచలం టెంపుల్ హుండీ లెక్కింపు తాజా వార్తలు
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ అధికారులు లెక్కించారు. గడిచిన 10 రోజులకు గానూ రూ. 21,60,381 నగదుతో పాటు 26 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి వస్తువులను భక్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

సింహాచలం అప్పన్న ఆలయంలో హుండీ లెక్కింపు
కరోనా ప్రభావంతో 80 రోజుల పాటు ఆలయాలు మూతపడ్డాయి. అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇవ్వటంతో ఆదాయం కొంత మేర తగ్గింది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది భక్తులకు దర్శనభాగ్యం దేవాదాయ శాఖ అధికారులు కలిపిస్తుండటంతో మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:వలస కార్మికుల కోసం 'ప్రధాని' నూతన పథకం