జన్‌ధన్ ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేసిన డబ్బు తీసుకునే విషయంపై ఎస్బీఐ స్పష్టతనిచ్చింది. ఎప్పుడైనా తీసుకోవచ్చునని భారతీయ స్టేట్ బ్యాంకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా తెలిపారు. లాక్డౌన్ పూర్తయ్యేలోపు నగదు తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదని ఆయన వెల్లడించారు. ఒకసారి మీ జన్‌ధన్ ఖాతాల్లో డబ్బు జమ అయితే అది తిరిగి వెనక్కి వెళ్లదని వివరించారు.
జన్‌ధన్ ఖాతాల నుంచి డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చు - Sbi Cgm On Jandhan Accounts
జన్‌ధన్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసిన డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చని భారతీయ స్టేట్ బ్యాంకు తెలంగాణ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా తెలిపారు.
జన్‌ధన్ ఖాతాలలో డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చు
భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులు ఎవరు కూడా డబ్బు తీసుకోలేకపోయామని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఖాతాల నుంచి డబ్బు తీసుకోడానికి వచ్చే ఖాతాదారులు... ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించటంతోపాటు మాస్కులు ధరించి బ్యాంకు సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..
TAGGED:
Sbi Cgm On Jandhan Accounts