తెలంగాణ

telangana

ETV Bharat / state

Rains In Telangana: రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 7 డిగ్రీలు అదనంగా పెరగడంతో రాత్రిపూట చలి తీవ్రత తగ్గిందని వెల్లడించింది.

Rains In Telangana
మోస్తరు వర్షాలు

By

Published : Nov 15, 2021, 11:07 AM IST

బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా. ఇది ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతానికి చేరే అవకాశాలున్నాయి. తూర్పు భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు (Rains in Telangana) కురిసే అవకాశాలున్నాయి.

ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 7 డిగ్రీలు అదనంగా పెరగడంతో రాత్రిపూట చలి తీవ్రత తగ్గింది. రామగుండంలో ఆదివారం తెల్లవారుజామున 25 డిగ్రీలు నమోదయింది. శీతాకాలంలో రాత్రిపూట ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవడం ఈ నెలలో ఇదే తొలిసారి. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు (Rains in Telangana) కురిశాయి. అత్యధికంగా వెంకటాపురం(ములుగు జిల్లా)లో 3.3, రవీంద్రనగర్‌(కుమురం భీం)లో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

ఇదీ చూడండి:Weather Report: అండమాన్‌లో మరో అల్పపీడనం... ఇవాళ, రేపు భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details